ఆ బ్లెడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!

బీజింగ్‌ : ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల కరోనా పాజటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 8 వేల మందికి పైగా మృతిచెందారు.  రోజురోజుకు కరోనా మృతులు పెరుగుతున్న వేళ.. ఈ వైరస్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా చైనాలో కరోనా సోకిన 2,000 మంది రక్త నమునాలను పరీక్షించగా.. బ్లెడ్‌ గ్రూప్‌ ఏ ఉన్నవారికి ఈ వైరస్‌ వల్ల ఎక్కువ హాని కలిగే అవకాశం ఉన్నట్టుగా తేలింది. వుహాన్‌ యూనివర్సిటీ జోంగ్‌నాన్‌ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ విభాగానికి చెందిన జింగ్‌హువాన్‌ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.