వరుసగా రెండోసారి రౌడీనే..

క్రేజీకి హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేదని నిరూపించాడు టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ. మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది కూడా విజయ్‌ ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రెండోస్థానంలో నిలిచాడు. రామ్‌ చరణ్‌ గతేడాది మూడో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒక స్థానం మెరుగుపరుచుకొని రెండో స్థానంలోకి వచ్చాడు. ఇస్మార్ట్‌ శంకర్‌తో పుంజుకున్న ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని 2018లో తొమ్మిది స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనూహ్యంగా ప్రభాస్‌ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 9 నుంచి 19వ స్థానానికి పడిపోయాడు. వరుణ్‌ ఏడవ స్థానం, సుధీర్‌ బాబు తొమ్మిది, బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ పదవ స్థానంలో ఉన్నారు. (అది నా పర్సనల్‌: విజయ్‌ దేవరకొండ )