‘నా భార్య, బిడ్డను చూస్తే గర్వంగా ఉంది’

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశమంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ‘ప్రసాదించిన’ఈ ఖాళీ సమయాన్ని కొంతమంది కుటుంబానికి కేటాయించగా.. మరికొంత మంది తమలోని నైపుణ్యాలకు పదునుపెడుతూ సృజనాత్మకత జోడించి కరోనాపై పాటలు, పద్యాలు, కథలు, కవితల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొంత మంది కరోనాపై పోరులో తోటివారిని గెలిపించేందుకు సామాజిక సేవకు నడుం బిగిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భార్య మృదుల, కుమార్తె నైమిష కూడా ఈ కోవకే చెందుతారు. లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేయకుండా దర్జీ అవతారమెత్తి మాస్కులు కుడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో మనం చేసే చిన్న సాయానికి కూడా ఎదుటివారి ప్రాణాలు నిలపగల శక్తి ఉంటుందని చాటిచెబుతున్నారు.(రైట్‌ పర్సన్‌కు రాంగ్‌ నంబర్‌)